వరికుంటపాడు: భర్తను రిమాండ్కు తరలించారంటూ పోలీసుస్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

రిపోర్టర్: హరి స్థలం: వరికుంటపాడు

వరికుంటపాడు పోలీసు స్టేషన్ వద్ద ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. వరికుంటపాడు ఎస్టీ కాలనీకి చెందిన ఇట్లా రవిని భార్య ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. దీంతో మనస్తాపం చెందిన భార్య ప్రతిమ స్టేషన్ వద్దకు చేరుకుని వెంట తెచ్చుకున్న విషద్రావణాన్ని తాగి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.