ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రులలో గాలికి కొట్టుకుపోతున్న ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు గాలికి కొట్టుకుపోతున్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే బహుళ అంతస్తుల భవనాల్లో ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలంకార ప్రాయంగా మారిన అగ్నిమాపక పరికరాలు, అధికారుల నామమాత్రపు తనిఖీలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాద నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఫైర్ సేఫ్టీ లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.