యువతకు ప్రమాదకరంగా విదేశీ గడ్డ: విద్యార్థుల భద్రతపై నేహా నగర్ ఆందోళన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: London
విదేశాలకు వెళ్లే విద్యార్థులు అక్కడ ఎదురవుతున్న జాతి వివక్ష, వలస వ్యతిరేక ధోరణులపై తీవ్రంగా ఆలోచించాలని ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ నేహా నగర్ హెచ్చరించారు. బ్రిటన్లో భారతీయులకు రక్షణ కరవైందని, విద్యార్థులను స్థానికులు బెదిరిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పిల్లలను పంపే ముందు తల్లిదండ్రులు అక్కడ పరిస్థితులపై ఆరా తీయాలని, విదేశీ గడ్డపై భారతీయులను టార్గెట్ చేయడం పెరిగిందని నేహా నగర్ ఆవేదన వ్యక్తం చేశారు.