యాభై వేలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోడీ
రిపోర్టర్: సురేష్
స్థలం: India
దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంలో భాగంగా నిర్వహించిన 20వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 51,000 మందికి పైగా నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో ఏకకాలంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ పత్రాలు అందాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోందని స్పష్టం చేశారు.