మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో టీవీఎస్ అపాచీ రోనిన్ బైక్ కొత్త వేరియంట్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: భారతదేశం

యువతను ఆకట్టుకునేలా టీవీఎస్ మోటార్ కంపెనీ తన అపాచీ మరియు రోనిన్ సిరీస్ బైక్స్‌లో కొత్త టాప్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అపాచీ RTR 160, 160 4V, 200 4V మోడళ్లతో పాటు RTR 310, RR 310 బ్లాక్ డైమండ్ ఎడిషన్లను అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు, ట్రాక్షన్ కంట్రోల్, మ్యాప్స్ మిర్రరింగ్, కీ లెస్ గో సాంకేతికతతో ఆకర్షణీయమైన ధరలలో ఈ పండగ సీజన్‌లో డెలివరీ అయ్యేలా విడుదల చేసింది.