అభద్రతాభావమే తనను ఇన్ని సినిమాలు తీసేలా చేసిందన్న ప్రియదర్శన్
రిపోర్టర్: శివ
స్థలం: భారత్
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ప్రియదర్శన్ తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం వెనుక ఉన్న అభద్రతాభావాన్ని బయటపెట్టారు. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆయన తాజా చిత్రం హైవాన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రతి విజయవంతమైన సినిమా తర్వాత కూడా ప్రేక్షకులనాడిని పట్టుకోవడంపై తనకు నమ్మకం కుదరదని, ఆ అనిశ్చితి, అభద్రతాభావమే తనతో 98 సినిమాలు నిర్మింపజేసిందని స్పష్టం చేశారు.