రుషికొండ ప్యాలెస్ నిర్వహణపై స్పందించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ప్రస్తుతానికి ఎలాంటి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడకుండా ఒక తెల్ల ఏనుగులా మారిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. ఈ భవనాన్ని కమర్షియల్ హోటల్గా మార్చడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత వినియోగం కోసం నిర్మించడం వల్ల ప్రముఖ బ్రాండ్లు ముందుకు రావట్లేదని పేర్కొన్నారు. ప్రజల సొమ్ము వృధా కాకుండా నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసి వీలైనంత త్వరగా పూర్తిస్థాయి వినియోగంలోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.