డక్కిలిలో బీఎస్పీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్లిన మస్తానమ్మ
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో జడ్పిటిసి బీఎస్పీ అభ్యర్థి వెంకన్న భార్య జోరేపల్లి మస్తానమ్మ గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కోసం బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేసి ఏనుగు గుర్తుపై గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.