యువ శాస్త్రవేత్తల ఛాలెంజ్లో ప్రతిభ: అగ్ర బహుమతి గెలుచుకున్న బెయిలీ ఫ్రాంక్

రిపోర్టర్: హరి స్థలం: Washington D.C.

అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరిగిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ పోటీల్లో పదిహేనేళ్ల విద్యార్థిని బెయిలీ క్విన్ ఫ్రాంక్ అగ్ర బహుమతిని గెలుచుకున్నట్లు సొసైటీ ఫర్ సైన్స్ ప్రెసిడెంట్ మాయా అజ్మేరా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ముప్పులను పసిగట్టేందుకు తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ డిఎన్ఎ శాంప్లర్ను ఆమె రూపొందించారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.