రైతుబజార్లలో కిలో ముప్పై ఐదు రూపాయలకే ఉల్లి విక్రయం ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: Vijayawada

బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీ రైతుబజారులో కిలో ఉల్లిపాయలను రాయితీపై ముప్పై ఐదు రూపాయలకే విక్రయించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్సీసీఎఫ్ సహకారంతో రాష్ట్రంలోని నూట పదిహేను రైతుబజార్లలో ఆధార్ కార్డు చూపితే ఒక్కొక్కరికీ రెండు కిలోల చొప్పున ఉల్లి అందిస్తున్నామని, త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై ఇస్తామని తెలిపారు.