విశాఖలో ప్రైవేట్ పాఠశాలలో మెట్లపై నుంచి పడి బాలికకు తీవ్ర గాయాలు

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం మధురవాడలోని శ్రీగాయత్రీ విద్యానిలయంలో కలకలం రేగింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మెట్లపై నుంచి జారిపడి బాలిక గాయపడినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం గాయపడిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.