డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉన్నతి పథకం కింద అర్హత ఉన్న ప్రతి డ్వాక్రా మహిళకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాధారణ మహిళలు ఇరవై నాలుగు నెలల్లో, ఎస్సీ ఎస్టీ మహిళలు ముప్పై ఆరు నెలల్లో అసలు మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించామని, ఆసక్తి గలవారు డీఆర్డీఏ అధికారులను సంప్రదించాలని సూచించారు.