'టీడీపీలో చేరిక': విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కుమార్తె సిరి సహస్ర కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, పలువురు నేతలు పాల్గొన్నారు.