గాజువాకలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని మొల్లివాణిపాలెం, ముసలనాయుడు పాలెం, అయ్యన్నపాలెం గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహా విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా జగద్గురు శ్రీ కృష్ణుడి ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, నడిగట్ల ప్రసాద్, పైడిరెడ్డి తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.