ముంబైలో సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్ విక్రయం రూ. 3.5 కోట్లకు పూర్తి
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహారాష్ట్ర
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల తన అపార్ట్‌మెంట్‌ను రూ. 3.5 కోట్లకు విక్రయించారు. 2015లో రూ. 2.88 కోట్లకు కొనుగోలు చేసిన ఈ 758 చదరపు అడుగుల ఫ్లాట్‌ను, ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్ ద్వారా ముగ్గురు కొనుగోలుదారులకు విక్రయించినట్లు డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 11 ఏళ్ల కాలంలో దీనిపై కేవలం 21.5 శాతం లాభం మాత్రమే సమకూరింది.