నిరుద్యోగులకు గుడ్ న్యూస్: రేపటి నుంచే గ్రూప్-1 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ ఆరు నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రముఖ శాఖల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అందరూ అక్టోబర్ ఇరవై ఏడు లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని కమిషన్ సూచించింది.