చెన్నైలో కలకలం: గోవా వెళ్లే ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Chennai
చెన్నై నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు రావడంతో ఎయిర్పోర్టులో తీవ్ర కలకలం రేగింది. బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ ఈ హెచ్చరికను నిర్ధారించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారని అధికారులు తెలిపారు. వెంటనే విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా దించి తనిఖీలు చేపట్టారు. సుదీర్ఘ తనిఖీల తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.