విజయవాడలో ఉపాధ్యాయులపై దాడి కేసులో అరాచక శక్తుల గుర్తింపునకు పోలీసుల గాలింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన అరాచక శక్తులను గుర్తించేందుకు పోలీసులు డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో సహా 127 మందిని స్పష్టంగా గుర్తించి డిజిటల్ సాక్ష్యాలు సేకరించామన్నారు. ప్రధాన నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లగా, ఇప్పటివరకు 37 మందిని అరెస్ట్ చేసి న్యాయాధికారి ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.