కంటి కురుపుల సమస్యకు చెక్: నిపుణులు చెబుతున్న ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

కంటి రెప్పపై వచ్చే కురుపుల వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతుందని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఇవి తగ్గిపోతాయని శంకర కంటి ఆసుపత్రి ఆక్యులోప్లాస్టీ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష పోల్కంపల్లి వెల్లడించారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య వస్తుందని, గోరువెచ్చని నీటితో కాపడం పెట్టడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.