మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కుట్రలో సంచలన నిజాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్ర టెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేవలం ఎనిమిది వేల రూపాయల కోసం లక్షలాది మంది భవిష్యత్తుతో చెలగాటమాడినట్లు థానే సిటీ పోలీసులు భివాండీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో వెల్లడించారు. ఆగ్రా ప్రింటింగ్ ప్రెస్ నుంచి సెక్యూరిటీ కళ్లకప్పి షూ ఇన్సోల్స్‌లో దాచి ప్రశ్నాపత్రాలను బయటకు తెచ్చినట్లు, ఈ కుట్ర వెనుక బిజేంద్ర గుప్తా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.