ఉట్నూర్ దసరా వేడుకల్లో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఉట్నూర్

ఉట్నూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగిన విజయదశమి వేడుకల్లో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.