సంగీత్ చిత్రం నుంచి నీ వల్లే రొమాంటిక్ మెలోడీ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

యువతను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న సంగీత్ సినిమా నుంచి తొలి పాట నీ వల్లే విడుదలైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ ఎక్స్ వేదికగా ఈ గీతాన్ని విడుదల చేశారు. నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా, అచు రాజామణి సంగీతం అందించారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ మధురమైన రొమాంటిక్ గీతం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.