ఘనంగా సైమా అవార్డుల వేడుక.. ఉత్తమ నటుడిగా తేజ సజ్జా
రిపోర్టర్: రాజేష్
స్థలం: కర్ణాటక
బెంగళూరు వేదికగా సైమా 2026 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు వేడుకల్లో మిరాయ్ చిత్రానికి గానూ తేజ సజ్జా ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఐశ్వర్య రాజేష్ ఉత్తమ నటి (క్రిటిక్స్), బుల్లిరాజు ఉత్తమ హాస్య నటుడిగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సందడి చేశారు.