నాణ్యత లోపంతో నత్తనడకన సాగుతున్న ఆలేరు అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం నాణ్యత లోపించి ఆరు నెలల్లోనే ఇనుప చువ్వలు తేలిందని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పట్టణ నాయకులు ఇక్కిరి శ్రీనివాస్ ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.