రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న పొదుపు మహిళ: అంకితభావంతో అద్భుతమైన ప్రస్థానం

రిపోర్టర్: రమేష్ స్థలం: రాపూరు

పొదుపు సంఘంలో సాధారణ సభ్యురాలిగా ప్రస్థానం ప్రారంభించి తన చేతిరుచులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండి స్వర్ణలతను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. విజయవాడలో జరిగిన జాతీయస్థాయి సరస్మేళాలో ఆమె ఏర్పాటు చేసిన స్టాల్ను రాష్ట్రపతితో పాటు సీఎం చంద్రబాబు సందర్శించి ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.