విజయనగరం పేద విద్యార్థులకు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరంలో పేదరికంతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పూసపాటి వంశీయులు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఏడాదంతా ఉచిత భోజన సత్రం నిర్వహిస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి భోజన సత్రం ద్వారా మాన్సాస్ విద్యాసంస్థల్లో చదువుతున్న సుమారు 450 మంది విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వినతి మేరకు రూ.1.16 కోట్లతో సత్రం ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.