సూర్యాపేటలో ఎండిపోతున్న పంటలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సూర్యాపేట
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సూర్యాపేటలో చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని విమర్శలు వస్తున్నాయి. తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.