అహోబిలంలో మహాలయ అమావాస్య వేడుకలు: శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆళ్లగడ్డ

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామివార్లకు పంచామృతాలతో వైభవంగా అభిషేకం జరిపారు. ముఖ ద్వార మండపంలో స్వామివారికి అభిషేకాలు, లేపన పూజలు నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించగా, రాత్రి వేళ ప్రత్యేక అలంకరణలో తిరువీధుల్లో పల్లకి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ వెల్లడించారు.