పులివెందుల అరాచకాలపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు: వైఎస్సార్సీపీ తీరుపై వర్ల రామయ్య నిప్పులు

రిపోర్టర్: సునీల్ స్థలం: కడప

పులివెందులలో వైఎస్సార్సీపీ అరాచకాలు చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆధ్వర్యంలో నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. పులివెందులలో ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ అధినేత జగన్ అల్లర్లకు తెర తీశారని, సొంత వాహనాలను వారే తగలబెట్టుకుని టీడీపీపై నెపం నెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికలతో పులివెందులలో ఆ కుటుంబ హవా తుడిచిపెట్టుకుపోతుందని రామయ్య స్పష్టం చేశారు.