వినేశ్ ఫోగాట్‌కు దిల్లీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ

రిపోర్టర్: కిరణ్ స్థలం: దిల్లీ

వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని, ఒక్కరి కోసం వాటిని సవరించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఆమె ఇంటర్నేషనల్ కెరీర్ రీ-ఎంట్రీ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.