అల్మాస్ గూడలో మహిళలపై దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే శిక్షించాలి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మందమర్రి

తెలంగాణ అల్మాస్ గూడలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలపై జరిగిన దాడిని మందమర్రి క్రైస్తవ షాలోమ్ పాస్టర్స్ ఫేలోషిప్ తీవ్రంగా ఖండించింది. ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వాతంత్ర్య హక్కుపై దాడి అని అధ్యక్షులు ఏలియ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరియు పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.