కళా ప్రపంచంలో విషాదం: నేచర్ మోర్టే వ్యవస్థాపకుడు పీటర్ నాగి కన్నుమూత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
భారతీయ సమకాలీన కళలను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీకి చెందిన ప్రముఖ నేచర్ మోర్టే ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకుడు పీటర్ నాగి అనారోగ్యంతో అరవై ఏడేళ్ల వయసులో మరణించినట్లు గ్యాలరీ వర్గాలు వెల్లడించాయి. ఆయన కోరిక మేరకు గ్యాలరీని మూసివేయకుండా తెరిచే ఉంచామని, కళాకారులకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని నిర్వాహకులు తెలిపారు.