ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను శనివారం ప్రచురించింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల అభ్యంతరాలను పరిశీలించి, కలెక్టర్ల ఆమోదంతో ఈ తుది నివేదికను అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.