ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్: ఈనెల 3న ఓట్ల లెక్కింపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Vijayawada
రాష్ట్రంలో తొంబై రెండు పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్ లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా సాగాయని ఆయన తెలిపారు. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల మూడవ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.