సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంకు సమ్మె

రిపోర్టర్: రాజేష్ స్థలం: భారతదేశం

బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె జరగనున్నందున ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.