పాలకొండలో వైఎస్సార్సీపీలోకి భారీగా తరలివచ్చిన నూట ఐదు కుటుంబాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భమిని

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండలంలో వివిధ పార్టీలకు చెందిన నూట ఐదు కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఘనసర, బురుజోల మరియు సింగిడి గ్రామాలకు చెందిన వీరికి మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా అందరం కలిసి కట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.