గుర్గావ్‌లో మహిళా బైకర్‌పై కారుతో ఢీకొట్టిన ఘటన కలకలం

రిపోర్టర్: హరి స్థలం: హరియాణా

గుర్గావ్‌లో మహిళా బైకర్‌ను కారుతో వెంబడించి ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సియా అనే మహిళా బైకర్ వెళ్తుండగా మందుబాబులు కారుతో ఢీకొట్టి పరారయ్యారు. కారు యజమాని మనీశ్ మాట్లాడుతూ తన స్నేహితుడు కల్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం కారు తీసుకువెళ్లాడని తెలిపాడు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.