ఖానాపురం అశోక్‌నగర్ శివారులో వాహనదారులను భయపెడుతున్న మృత్యుగుంత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖానాపూర్
అశోక్‌నగర్ గ్రామ శివారులో రోడ్డు కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద గుంత ఉండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ప్రయాణించినా ప్రమాదం బారినపడే పరిస్థితి నెలకొంది. రాత్రివేళల్లో ముప్పు మరింత ఎక్కువగా ఉందని స్థానికులు తీవ్రంగా వాపోతున్నారు. పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.