టపాసులు కాల్చే సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లాలో దీపావళి వేడుకల సందర్భంగా ప్రజలు అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ డి. రామారావు సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని తెలిపారు. కాలిన గాయాలైతే చల్లని నీటితో కడిగి వైద్యులను సంప్రదించాలని, అత్యవసర సమయాల్లో 108 సేవలను ఉపయోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.