మార్కెట్లోకి వి-రిచ్ ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యి విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌కు చెందిన క్లీన్-లేబుల్ ఫుడ్ బ్రాండ్ వి-రిచ్ సంప్రదాయ ఆహార ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెడుతూ ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా ఇన్‌స్టంట్ తడ్కా నెయ్యిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఉద్యోగులు, సమయం లేని కుటుంబాల కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వంటి 7 రకాల పోపు దినుసులను స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేయించి దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం 250ఎంఎల్ జార్ ధర రూ. 449 కాగా, కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ మరియు బ్లింకిట్ యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంది.