ఏపీ పోర్టులకు రైల్వే కనెక్టివిటీపై కేంద్రం దృష్టి

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల నుంచి ఏపీలోని వివిధ పోర్టులకు సరుకు రవాణా మరియు ప్రయాణికుల రాకపోకలను సులువు చేయడానికి రైల్వేశాఖ తొమ్మిది కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు.