బహుదా వరద ఉద్ధృతి: హైవేపై ట్రాఫిక్ పునరుద్ధరించిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

బహుదా నది వరద ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను పూర్తిగా పునరుద్ధరించారని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితులపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ రహదారిపై వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని ఆయన పేర్కొన్నారు.