మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిందితుడు సౌరభ్ చంద్రకర్ ఒమన్ నుంచి అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: Raipur
మహాదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్ ను ఒమన్ నుంచి భారత్ కు రప్పించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. విదేశాల నుంచి అక్రమ బెట్టింగ్ నెట్ వర్క్ నిర్వహిస్తున్న ఈ నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం రాయ్ పూర్ ప్రత్యేక కోర్టులో అతడిని హాజరుపరచనున్నట్లు సీబీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ మరియు సీబీఐ కేసులు నమోదు చేశాయి.