మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలంటూ జగన్పై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ సత్యసాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ-2025 పరీక్షలు మరియు నియామకాలు అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పరిటాల శ్రీరామ్ - ధర్మవరం టీడీపీ సమన్వయకర్త స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం నకిలీవని ఆరోపిస్తున్న స్పోర్ట్స్ సర్టిఫికెట్లను గత వైకాపా ప్రభుత్వ హయాంలోనే జారీ చేశారని పేర్కొంటూ, తాము ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టు ఆదేశిస్తే దేనికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.