మేడ్చల్ జిల్లాలో వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం
రిపోర్టర్: సురేష్
స్థలం: మేడ్చల్
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని సోమారం గ్రామంలో వాటర్ హీటర్ పేలిన ప్రమాదంలో బల్గురి మహేష్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్నానం కోసం హీటర్ పెట్టి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరగగా, సుమారు రూ. 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.