ఎండిపోతున్న పొలాలకు ప్రాణం పోసేలా కృష్ణా జలాలు అందించాలి
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
తెలుగునాట ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులను నివారించడానికి మహారాష్ట్రలోని కోయిన డ్యామ్ నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న కృష్ణా జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు మళ్లించాలని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు. వర్షాభావంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని, తాగునీటి ఎద్దడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఒప్పందాల ప్రకారం రావాల్సిన నీటి వాటాలను రప్పించేందుకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన నెల్లూరులో డిమాండ్ చేశారు.