పాలమూరు బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అత్యంత దుర్మార్గం కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Mahabubnagar
జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను గాలికొదిలేసి అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.