విజయవాడలో బ్లేడ్ దాడి కేసు: నిందితుడికి ఏడాది కఠిన కారాగారశిక్ష
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో యువకుడిపై బ్లేడ్‌తో దాడి చేసిన కేసులో కందుల విఘ్నేశ్వరరావుకు ఏడాది కఠిన కారాగారశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.సుధ బుధవారం తీర్పు వెల్లడించారు. 2022 ఏప్రిల్ 3న విజయవాడలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు సంచలన తీర్పునిచ్చారు.