ఎన్కౌంటర్లో హతమార్చే కుట్ర జరుగుతోందన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్

రిపోర్టర్: సునీల్ స్థలం: లేహ్

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న తనను ఎన్కౌంటర్లో హతమార్చే కుట్ర జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుతూ గతేడాది జరిగిన లేహ్ హింసాత్మక ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని లేహ్లో జరిగిన సభలో వాంగ్చుక్ స్పష్టం చేశారు.