అమెరికా ఎన్నికలు: విద్వేష రాజకీయాలకు ఓటమంటూ రిపబ్లికన్ నేతపై రాజా కృష్ణమూర్తి మండిపాటు

రిపోర్టర్: రాము స్థలం: టెక్సాస్

అమెరికాలో జరిగిన టెక్సాస్ రైల్రోడ్ కమిషనర్ ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రెంచ్ ఓటమిపై కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా స్పందించారు. దక్షిణాసియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన బో ఫ్రెంచ్ కు అమెరికా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వర్ణవివక్షతో కూడిన రాజకీయాలకు ఎప్పటికీ మనుగడ ఉండదని, ఓటమి తప్పదని రాజా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.